
497views
ధర్మపురి: తమిళనాడు ధర్మపురి జిల్లాలో అపశ్రుతి జరిగింది. మతేహల్లి గ్రామంలోని కాళిక దేవి జాతర సందర్భంగా.. భక్తులు రథం లాగుతుండగా.. భక్తులపైనే రథం బోల్తాపడింది. రథం చక్రాలు విరిగిపోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు భక్తులు రథం కింద చిక్కుకోగా.. ముగ్గురు భక్తులు మృతి చెందారు. ఇద్దరు గాయపడ్డారు. రథం లాగుతుండగా ఇలాంటి విషాదం జరగడం వల్ల భక్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.





