News

గిరిజన దేవతకి 11 కిలోమీటర్ల పొడవు చీర స‌మ‌ర్ప‌ణ‌.. మహిళల ప్రపంచ రికార్డు

452views

ఛత్తీస్​గఢ్​: ఛత్తీస్​గఢ్​ దంతేవాడకు చెందిన మహిళలు 11 కిలోమీటర్ల పొడవు ఉన్న వస్త్రాన్ని తయారు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. దంతేవాడలోని డెనెక్స్​ అనే టెక్స్​టైల్​ ఫ్యాక్టరీకి చెందిన మహిళలు ఈ వస్త్రాన్ని రూపొందించారు. ఈ వస్త్రాన్ని స్థానిక దంతేశ్వరి ఆలయానికి సమర్పించారు. ఇదివరకు మధ్యప్రదేశ్​లోని మందసూర్​ నర్మదా మైయా ఆలయానికి అక్కడి ప్రజలు ఎనిమిది కిలోమీటర్ల పొడవు ఉన్న వస్త్రాన్ని సమర్పించారు. తాజాగా దీనిని బద్దలు కొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పారు గోల్డెన్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్​లో దీనికి చోటు దక్కింది.

ప్రత్యేకంగా రూపొందించిన ఈ వస్త్రానికి శోభాయత్ర నిర్వహించారు. 300 మంది మహిళలు కేవలం ఏడు రోజుల్లో రూపొందించిన ఈ వస్త్రాన్ని దంతేవాడ పట్టణంలో 11 కిలోమీటర్లు ఊరేగించారు. ఇది చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మంగళవారం.. దంతేవాడకు చేరుకున్న ముఖ్యమంత్రి భుపేశ్​ భఘేల్​ ఆ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి