
అమృత్సర్(పంజాబ్): కోల్‌కతాకు చెందిన వ్యక్తిని, అతని సహచరుడిని పంజాబ్ పోలీసులు బుధవారం (మే 18) అరెస్టు చేశారు. నిందితులు కోల్‌కతాలో పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నారు. అరెస్టయిన గూఢచారులు కోల్‌కతాలోని ఎంటాలీకి చెందిన జాఫర్ రియాజ్, అతని సహచరుడు మహ్మద్ శంషాద్(బీహార్‌లోని మధుబని నివాసి) అని గుర్తించారు.
“ఇంటెలిజెన్స్ నేతృత్వంలోని ఆపరేషన్‌లో, రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ సెల్ అమృత్సర్ జాఫర్ రియాజ్, మహ్మద్ షంషాద్‌ను అరెస్టు చేసింది. అతను ఇప్పుడు అమృత్‌సర్‌లోని మిరాకోట్ చౌక్‌లో అద్దెకు ఉంటున్నాడు” అని పంజాబ్ పోలీసులు తెలిపారు.
వారిపై అధికారిక రహస్యాల చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే వారి వల్ల జరిగిన నష్టాన్ని నిర్ధారించడానికి కేసుపై తదుపరి దర్యాప్తు జరుగుతోంది.
2005లో లాహోర్‌లోని మోడల్ టౌన్లో నివాసం ఉంటున్న పాకిస్తాన్ జాతీయురాలు రబియాను జాఫర్ వివాహం చేసుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మొదట్లో, రబియా కోల్‌కతాలో అతనితో కలిసి ఉండేది. కానీ, 2012లో అతనికి ప్రమాదం జరిగిన తర్వాత, అతని ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. అతని అత్తామామల ఒత్తిడితో, అతను లాహోర్‌కు మారాడు. జాఫర్ తన చికిత్స సాకుతో తరచుగా భారతదేశానికి వచ్చేవాడు.
ఈ సమయంలో, అతను లాహోర్‌లోని ఎఫ్ఆర్ఆర్ఓ కార్యాలయంలో పనిచేస్తున్నట్టు చెప్పుకునే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (పిఐఓ) అవైస్‌తో సంప్రదించాడు. నిందితుడిని ఐఎస్ఐ కోసం పని చేయమని పిఐఓ ఒప్పించాడు. దాని ఫలితంగా, అతని భారతదేశ పర్యటనల సమయంలో, నిందితుడు భారతీయ ఆర్మీ భవనాలు, వాహనాలు మొదలైన వాటి ఫోటోలు, వీడియోలను క్లిక్ చేసి, ఎన్క్రిప్టెడ్ యాప్‌ల ద్వారా షేర్ చేశాడు. అతని మొబైల్ ఫోన్‌ను ప్రాథమిక తనిఖీలో, ఆ ఫోటోలు, వీడియోలు లభించాయని పోలీసులు తెలిపారు.
జాఫర్.. అవైస్కు మొహమ్మద్ షంషీద్ను పరిచయం చేశాడు. అమృత్ సర్ రైల్వే స్టేషన్ ఎదురుగా తాను నిమ్మరసం బండి నడుపుతున్నట్టు షంషాద్ వెల్లడించారు. అమృత్‌సర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, కంటోన్మెంట్ ఏరియా ఫోటోలను తాను క్లిక్ చేసి, జాఫర్‌కు ఇచ్చానని, ఆ చిత్రాలను అవైస్కు పంపాడని అతను చెప్పాడు. ఇద్దరిని పోలీసులు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నారు.
Source: Organiser





