
1.5kviews
జైషే మొహమ్మద్ జరిపిన పుల్వామా ఉగ్రదాడిపై యావత్ భారత దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ రోజు భారత వైమానిక దళాలు పాకిస్థాన్ భూభాగంలోని జైషే మొహమ్మద్ స్థావరాలే లక్ష్యంగా దాడి చేసి విజయవంతంగా పని ముగించుకొచ్చాయి. ఇది కోట్లాది భారతీయుల ఆకాంక్షలను ప్రతిబింబించే చర్య. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ భారత వైమానిక దళాన్ని మరియు భారత ప్రభుత్వాన్ని అభినందిస్తున్నది. పాకిస్థాన్ సైన్యానికి గాని, పౌరులకు గాని ఎలాంటి నష్టమూ కలిగించకుండా కేవలం తీవ్రవాదులే లక్ష్యంగా సాగిన ఈ దాడులు మరొక్కసారి భారతీయ సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటుతున్నాయి.





