
757views
ఢిల్లీ: పాకిస్తాన్‌కు పట్టుబడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ శుక్రవారం రాత్రి 9:15 గంటలకు భారత భూభాగంపై అడుగుపెట్టారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం ఢిల్లీ హాస్పిటల్‌లో ఉన్న అభినందన్‌ను రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. జాతి యావత్తు తాను చూపిన ధైర్యాన్ని, పరాక్రమాన్ని, సంయమయంను చూసి గర్వపడుతోందని అభినందన్‌కు తెలిపారు.
ఇక పాకిస్తాన్‌లో బంధీగా ఉన్నప్పుడు తన అనుభవాల గురించి సీతారామన్‌కు అభినందన్ వివరించినట్లు తెలుస్తోంది. దాదాపు గంటపాటు మంత్రితో పాక్‌లో తన అనుభవాల గురించి అభినందన్ వివరించారు.





