News

పూర్వ ప్రాంత సంఘచాలక్ వెంకటేశ్వర రావు మృతి

570views

భాగ్య‌న‌గ‌రం: అక్షయ తృతీయ పుణ్యదినాన, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ తెలంగాణ ప్రాంత పూర్వ సంఘచాలక్, ఎందరో స్వయం సేవక్‌లకు స్ఫూర్తి ప్రదాత, నిరంతర చైతన్య స్ఫూర్తి వెంకటేశ్వర రావు స్వర్గస్థులయ్యారు. ఆయన వయస్సు 76 సంవత్సరాలు.

అనారోగ్యంతో కొద్ది రోజులుగా కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఈయ‌న‌ భాగ్యనగర్ స్వయంసేవక్. గడిచిన 50 సంవత్సరాలకు పైగా రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ‌(ఆర్‌.ఎస్‌.ఎస్‌)లో గట నాయక్ స్థానం నుండి ప్రాంత సంఘచాలక్‌గా ఎన్నో బాధ్యతలు నిర్వహించారు.

ఆయన స్వయంగా గాయకులు. పూజ్య గురూజీ నుండి అందరూ సర్ సంఘచాలక్‌లను అతి దగ్గర నుండి చూసారు. మానవతా మూర్తి, నిరంతర చైతన్య శీలి. అనేక కార్యకర్తలకు స్ఫూర్తి ప్రదాత. వారి మరణం స్వయం సేవకులకు తీరని లోటు అని తెలంగాణ ప్రాంత సంఘచాలక్ బూర్ల దక్షిణామూర్తి నివాళులు అర్పించారు. సివిల్ సూప‌రింటెండెంట్ ఇంజినీర్ గా రహదారులు, భవనాల శాఖలో పనిచేసి ఆయన పదవి విరమణ చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి