
బరేలీ: గ్రూమింగ్ జిహాద్ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. అక్కడ ఒక అమ్మాయితో స్నేహం చేయడానికి రాహుల్‌గా నటించిన కాసిమ్ అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక 12వ తరగతి విద్యార్థిని. తప్పుడు గుర్తింపుతో తనను తాను పరిచయం చేసుకున్న కాసిమ్ ఆన్లైన్లో కలిశాడు. అతను తన హిందూ గుర్తింపు గురించి అమ్మాయిని ఒప్పించడానికి తిలకాన్ని కూడా ధరించాడు. అతను రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర కాలంగా తన ప్రేమ ఉచ్చులో ఆ బాలికను బంధించాడు. చివరకు ఆమెతో సన్నిహితంగా మెలిగిన అతడు అసభ్యకర వీడియోలు కూడా తీశాడు.
ఆమె అతని నిజస్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత, దూరం చేసుకోవడం ప్రారంభించింది. దీంతో కాసిమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిఖా కోసం ఆమెపై ఒత్తిడి తెచ్చి ఆమెను ఇస్లాంలోకి మార్చేందుకు ప్రయత్నించాడు. ఆమె అసభ్యకరమైన ఫోటోలు, వీడియో క్లిప్‌లను ఆన్లైన్లో లీక్ చేస్తానని బెదిరించాడు.
ఆమె కనికరించకపోవడంతో, అతను ఏప్రిల్ 26న ఆమె ఇంటి నుండి తన స్నేహితులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడు. ఆమె కేకలు విన్న ఇరుగుపొరుగు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు అప్పగించారు. అతడి మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారం, బెదిరింపు, బాలికను బలవంతంగా మతమార్పిడి చేసేందుకు ప్రయత్నించిన ఆరోపణల కింద కాసిమ్ అరెస్టయ్యాడు.
Source: HINDU POST





