News

ప్రాణహిత పుష్కరాలను పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం

569views

భాగ్య‌న‌గ‌రం: మరో ఐదు రోజులలో ప్రారంభం కానున్న ప్రాణహిత పుష్కరాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పన్నెండేళ్ల కోసారి వచ్చే పుష్కరాలపై చిన్నచూపు చూస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం దగ్గరపడినా ఎటువంటి పనులు చేపట్టడం లేదు. తెలంగాణలోనే పుట్టి, ఇక్కడే అంతర్లీనమయ్యే జీవనది ప్రాణహిత. గోదావరి నదికి ప్రాణహిత ప్రధాన ఉపనది.

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడి హెట్టికి పైభాగంలో పెన్ గంగా, వార్దా నదుల కలయితో ప్రాణహిత నది పుట్టింది. తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత ప్రయాణం మొదలై కాళేశ్వరం వరకు 113 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో ప్రాణహిత కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది.

ఈనెల 13 నుంచి 24 వరకు పన్నెండు రోజుల పాటు ప్రాణహిత పుష్కరాలు జరుగనున్నాయి. అవతలి వైపు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుండగా తెలంగాణ ప్రభుత్వం ఇవతలి వైపు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి