News

ఉత్తరభారతంలో శ్రీవారి దేవాలయాలు

454views
  • టీటీడీ ఢిల్లీ దేవాలయ కమిటీ నియామకం

తిరుప‌తి: తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీ సలహామండలి ఛైర్మన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ ఢిల్లీ దేవాలయ కమిటీ నియామకం జరిగింది. స్థానిక సలహా కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సేవలను దేశరాజధాని ఢిల్లీతో పాటు , ఉత్తర భారత దేశంలో విస్తృతం చేయడానికి కమిటీ సహాయపడుతుందని ప్రశాంతి చెప్పారు.

ఢిల్లీ ఆలయంలో వాస్తు నిపుణులు సూచించినట్టు మార్పులు చేయాలని నిర్ణయించామని అన్నారు. మే నెలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని తాము భావిస్తున్నామని.. ఈ మేరకు ధర్మప్రచార వాహనం ఏర్పాటు చేసి స్వామివారి ప్రచారం నిర్వహించనున్నామని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి