News

గుజరాత్ ఆప్ నేత యువరాజ్‌సింగ్ జడేజా అరెస్ట్‌!

495views

గాంధీన‌గ‌ర్‌: పోలీసు కానిస్టేబుల్‌పై హత్యాయత్నం నేరం కింద ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు అరెస్ట్‌ అయ్యాడు. వివిధ సెక్షన‍్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీ కింద జైలుకు తరలించారు. డ్యూటీలో ఉన్న పోలీసులపై దాడి చేసి, కానిస్టేబుల్‌ను తన కారు బానెట్‌పైకి లాగినందుకు గుజరాత్ ఆప్ యువజన విభాగం నాయకుడు యువరాజ్‌సింగ్ జడేజాను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే, మంగళవారం కొందరు నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం గాంధీనగర్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద నిరసనలకు దిగారు. వారికి మద్దతు తెలిపేందుకు జడేజా అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, జడేజా మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసు కానిస్టేబుల్‌పై హత్యాయత్నం నేరం కింద ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు అరెస్ట్‌ అయ్యాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి