News

250 మంది భారతీయులతో ఢిల్లీకి చేరుకున్న రెండో విమానం

524views

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో రొమేనియా నుంచి 250 మంది భారతీయులతో బయల్దేరిన ఎయిర్​ ఇండియా రెండో విమానం దిల్లీకి చేరుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా విద్యార్థులకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్​ పరిస్థితులపై ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ఉక్రెయిన్​లో చిక్కుకున్న ఇతర భారతీయులకు కూడా ధైర్యం చెప్పాలని సూచించారు. సురక్షితంగా భారత్​కు చేరుకోవడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

తెలుగు విద్యార్థులు…

తెలుగు విద్యార్థులు కొందరు రొమేనియాకు చేరుకున్నారు. వీరు విమానాల్లో భారత్‌కు బయలుదేరారు. కృష్ణా జిల్లా కౌతవరం గ్రామానికి చెందిన అనూష శనివారం తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడారు. తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేస్తున్నాయని తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి