News

వచ్చే 25 ఏళ్ళ‌ పాటు దేశ పునాదులు పటిష్ఠంగా ఉండేలా కృషి

464views
  • రాష్ట్రపతి రామనాథ్ కోవింద్

న్యూఢిల్లీ: ‘సబ్‌ కా సాత్ సబ్‌ కా వికాస్’ మూలసూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోందని, వచ్చే 25 ఏళ్ళ‌పాటు దేశ పునాదులు పటిష్ఠంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశం సాధించిన ప్రగతి, సురక్షిత భవిష్యత్ కోసం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తోందో వివరించారు.

భారతీయులందరికీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘స్వాతంత్ర్య అమృతోత్సవ్’ శుభాకాంక్షలు తెలుపుతూ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులందరికీ నివాళులు తెలిపారు. కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి ప్రశంసించారు.

వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ద్వారా కోవిడ్‌పై పోరాటం భారతదేశ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటారని ప్రభుత్వాన్ని రాష్ట్రపతి కొనియాడారు. కేవలం ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే 150 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ డోసులు తీసుకోవడం రికార్డని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి