News

మీడియా వైఖరిపై భగ్గుమన్న లావణ్య తల్లి!

606views

తంజావూరు: క్రైస్తవ మతోన్మాదుల వేధింపులు తట్టుకోలేక లావణ్య ఆత్మహత్యకు పాల్పడితే, ఈ విషాదకర సంఘటనను సమాజానికి చేరవేయాల్సిన మీడియా వక్రమార్గం ఎంచుకుందని ఆ బాలిక తల్లి తమిళ మీడియాపై నిప్పులు చెరిగింది. తంజావూరులోని క్రైస్తవ పాఠశాల ‘మత వేధింపులు’ తట్టుకోలే 17 ఏళ్ళ విద్యార్థిని లావణ్య మృతి చెందిన విషయం విదితమే. క్రిస్టియన్‌ మతంలోకి మారాలని పాఠశాల ఒత్తిడిని తట్టుకోలేక ఈనెల తొమ్మిదోతేదీన ఆ పాప విషం తాగింది.

‘వారు(పాఠశాల) నా సమక్షంలో నా తల్లిదండ్రులను అడిగారు.. నన్ను క్రైస్తవ మతంలోకి మార్చగలిగితే, తదుపరి చదువుల కోసం సహాయం చేస్తామని చెప్పారు.. అయితే, నేను అంగీకరించనందున, వారు నన్ను హింసిస్తూనే ఉన్నారు’. ఈ మాటలు లావణ్య ఆస్పత్రిలో ఉండేటప్పుడు చెప్పినవి. ఈ వీడియో వైరల్‌ అయింది.

అయితే, బలవంతపు మతమార్పిడి సంగతిపై పాఠశాలు, చర్చిలను ప్రశ్నించాల్సిన మీడియా చివరకు లావణ్య వీడియోపై అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ వైఖరి చాలా మంది సోషల్‌ మీడియా వినియోగదారులకు ఆగ్రహం తెప్పించింది.

బాధితురాలి మరణ వాంగ్మూలాన్ని తారుమారు చేసి ప్రచారం చేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలి తల్లి విలేఖరులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె..‘ఆమె మరణ డిక్లరేషన్‌లో ఆమె చెప్పినది అబద్ధమని మీరు చెప్పాలనుకుంటున్నారా?’ అని నిప్పులు చెరిగింది.

ఇదిలావుండగా,
‘ఒక క్రైస్తవ పిల్లవాడు బోర్‌వెల్‌ గుంటలో పడి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయినప్పుడు, తమిళ మీడియా 24/7 కవరేజీని ఇచ్చింది. ఇంకా లక్షలాది మందిని దీపావళి వేడుకలకు దూరం చేసింది… మిషనరీల వేధింపుల వల్ల నిరుపేద హిందూ బాలిక లావణ్య మరణించినప్పుడు అదే మీడియా మలబద్ధకంలో ఉంది… అని ఒక ట్విటర్‌ యూజర్‌ మహేష్‌ (ఏమహేష్‌ 10816) తన ఆగ్రహాన్ని వెల్లగక్కాడు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి