News

10 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన భార్యకు తలాక్ .. మోడీ తీసుకొని వచ్చిన చట్టంతోనే న్యాయం

598views

ట్రిపుల్ తలాక్.. ఎంతో మంది మహిళల జీవితాల్లో అంధకారం నింపింది. చిన్న చిన్న కారణాలతో ట్రిపుల్ తలాక్ లు చెప్పి వెళ్ళిపోయిన మగవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బాధితులు చాలా రోజులుగా కోర్టుల చుట్టూ తిరిగారు. వారి బాధను గమనించిన మోడీ ఇటీవలే ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసేశాడు. ఇకపై తలాక్ చెప్పారంటే వారు కటకటాల పాలవ్వాల్సిందే. అయినా కొందరు అసలు మారరు. తాజాగా ఒక వ్యక్తి భార్యకు తలాక్ చెప్పాడు. ఇంతకూ కారణం ఏమిటో తెలుసా..? పుట్టింటి నుండి 10 నిమిషాలు ఆలస్యంగా రావడమే..!

ఉత్తరప్రదేశ్‌లో భార్య 10 నిమిషాలు ఆలస్యంగా ఇంటికి వచ్చిందని తలాక్ చెప్పాడు భర్త. ఈటాహ్‌కు చెందిన బాధితురాలు అనారోగ్యంతో బాధపడుతున్న తన నానమ్మను చూసేందుకు పుట్టింటికి వెళ్లాలనుకుంది. భర్తకు చెప్పగా.. నానమ్మను పరామర్శించి సరిగ్గా అరగంటలో తిరిగి ఇంటికి వచ్చేయాలని చెప్పాడు. మహిళ పుట్టింటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి 10 నిమిషాలు ఆలస్యమయ్యింది. కొద్దిసేపటికి భర్త ఆమెకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పి కట్ చేశాడు. అంతే బాధితురాలు.. ఆమె కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించింది. మోడీ తీసుకొని వచ్చిన కొత్త చట్టంతోనే న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు స్థానికులు. ఇప్పుడు ఆ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.