News

ఆర్‌ఎస్‌ఎస్‌ అఖిల భారతీయ సమన్వయ బైఠక్‌

428views

భాగ్యనగరం: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) స్ఫూర్తితో వివిధ సేవా రంగాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న కార్యకర్తల అఖిల భారతీయ సమన్వయ్‌ బైఠక్‌ (సమన్వయ సమావేశం) ఈరోజు తెలంగాణలోని భాగ్యనగం(హైదరాబాద్‌)లో ప్రారంభమైంది.

ఇటువంటి సమావేశం ఏడాదికోసారి జరుగుతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌ సంఘ్‌చాలక్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌, సర్‌ కార్యవాహ దత్తాత్రేయ హోస్బాలేతో పాటు మొత్తం ఐదుగురు సహ సర్‌ కార్యవాహలు, సంఘ్‌ ఇతర ముఖ్య బాధ్యులు హాజరయ్యారు.

అలాగే, 36 స్ఫూర్తిదాయక సంస్థల నుండి 216 మంది ప్రధాన కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కచ్చితంగా కొవిడ్‌ నియమ నిబంధనలు పాటిస్తూ సమావేశం జరుగుతోంది. డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారికే అనుమతించారు.

సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు. కేవలం ఉన్న సమాచారాన్ని పంచుకునే నిమిత్తం సమావేశమయ్యారు. గతేడాది గుజరాత్‌లోని కర్ణావతిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన భారతీయ మజ్దూర్‌ సంఘ్‌, స్వదేశీ జాగరణ్‌ మంచ్‌, లఘు ఉద్యోగ్‌ భారతి తదితర సంస్థలు దేశంలో ఉపాధిని మెరుగుపరిచే ప్రణాళికలపై చర్చించాయి. ప్రభుత్వ విధానాలు, గ్రాస్‌ రూట్‌ పరిస్థితిపై వారు చర్చించారు.

ఈ ఏడాది భారతీయ విద్యా వ్యవస్థ మెరుగుపరిచే నిమిత్తం విద్యా భారతి, ఏబీవీపీ, భారతీయ శిక్షణ మండల్‌, ఇతరత్రా విద్యా వ్యవస్థల నుంచి సలహాలు తీసుకుంటారు. ఇందుకు సంబంధించిన వారి అనుభవాలను పంచుకుంటారు.

కొవిడ్‌ సమయంలో సేవా భారతి కార్యక్రమాలపై అనుభవాలు పంచుకుంటారు. అంతేకాకుండా, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, పిల్లలలో పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి చేపట్టే చర్యలు గురించి సలహాలు తీసుకుంటారు.

రెండేళ్ళలో సంఘ్‌ 100 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. పర్యవరణ(పర్యావరణ), పరివార్‌ ప్రబోధన్‌(కుటుంబ అవగాహన), సామాజిక సమరస్తా(సామాజిక సామరస్యం) కార్యక్రమాలపై సమావేశంలో చర్చలు జరగనున్నాయి.

75వ స్వాతంత్య్ర వేడుకల్లో అన్ని సంస్థలు పాల్గొంటున్నాయి. వారు నిర్వహించిన కార్యక్రమాలు, స్పెషల్‌ డ్రైవ్‌లపై కూడా చర్చించనున్నారు.

7 జనవరి 2022న మధ్యాహ్నం 12:30 గంటలకు, సమావేశంలో జరిగిన చర్చల గురించి వివరించడానికి డాక్టర్‌ మన్మోహన్‌ వైద్య జీ(సహ సర్‌ కార్యవాహ) ద్వారా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు సంఘ్‌ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్‌ సునీల్‌ అంబేకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Source: rss.org

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి