
-
థాకరే సర్కారుకు మరో మరక
ముంబై: కార్గిల్ యుద్ధ వీరుడు దిగేంద్ర కుమార్‌తో పాటు మరో ఐదుగురిపై ‘ద్వేషపూరిత ప్రసంగం’ కింద కేసు నమోదు అయింది. దీంతో ‘సెక్యులర్’ ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం మరో మరక అంటించుకున్నట్టయింది. అఫ్జల్ ఖాన్‌పై ఛత్రపతి శివాజీ మహారాజ్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కిందటి నెల 19న జరిగిన శివప్రతాప్ దిన్ సందర్భంగా మతపరమైన ఆరోపణతో కూడిన ప్రసంగాలకు పూణే పోలీసులు 28న సుమోటోగా కేసు నమోదు చేశారు.

ఇదిలావుండగా, కెప్టెన్ దిగేంద్ర కుమార్ కార్గిల్ యుద్ధంలో గొప్ప పాత్ర పోషించాడు. ఇంకా, తన ప్రతిభకు మహావీర చక్ర లభించింది. ఈ యుద్ధంలో నాయక్ దిగేంద్ర కుమార్ ఎడమ చేతికి బుల్లెట్ తగిలింది. ఆ గాయాన్ని పట్టించుకోకుండా, అతను ఒక చేత్తో కాల్పులు జరుపుతూ శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు. ఇటువంటి వీరుడిపై ఉద్దేశపూర్వకంగానే పోలీసు కేసు నమోదైయిందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
Source: Hundupost





