News

గోశాలలో ఆవుల మృతిపై తీవ్రంగా స్పందించిన సాధు పరిషత్

593views
  • ప్రభుత్వం గో సంరక్షణ చేయాలని డిమాండ్

విశాఖ‌ప‌ట్నం: విశాఖ వెంకోజీపాలెంలో జ్ఞానానంద ఆశ్రమం గోశాలలో పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోతుండడంతో సాధుపరిషత్తు తీవ్రంగా స్పందించింది. గో సంరక్షణ బాధ్యత ప్రభుత్వంపై ఉందని సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర సాధుపరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి డిమాండ్ చేశారు. గోశాలలో ఆవుల దీన పరిస్థితిని పరిశీలించిన ఆయన.. వాటికి కనీసం ఏం కావాలన్న అంశాలను పట్టించుకోని పాలకుల తీరును ఎండగట్టారు. ఇప్పటికే పదికి పైగా గోవులు మృత్యువాత పడ్డాయని మిగిలినవి చనిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి