News

తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ బనియన్ ను రూపొందించిన భారత రక్షణ రంగ సంస్థ మిధాని

582views

భారత రక్షణ సంస్థ మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధాని) ప్రముఖుల కోసం తుపాకీ తూటాల నుంచి రక్షణ కల్పించే బనియన్‌ (బుల్లెట్‌ ప్రూఫ్‌ వెస్ట్‌)లో కొత్త రకాన్ని అభివృద్ధి చేస్తోంది. సాధారణంగా ధరించే బనియన్ ‌లా కనిపించేలా.. గతంలో ఉన్నదానికంటే తేలికగా దీన్ని డిజైన్‌ చేశారు. తెలుపు రంగులో ఉంటుంది. అజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా హైదరాబాద్​ కంచన్ ‌బాగ్‌లోని.. మిధాని ప్రదర్శనలో అధికారవర్గాలు ఈ విషయాన్ని తెలిపాయి. ఇప్పటివరకు ఆలివ్‌ గ్రీన్‌ దుస్తుల రంగుల్లో మిధాని ఈ తరహా వెస్ట్ ‌లను తయారు చేసింది. వాటి బరువు కాస్త ఎక్కువే. కొత్త వాటిలో అధునాతన కంపోజిట్‌ మెటీరియల్స్‌ ఉపయోగించి మరింత తేలికగా అభివృద్ధి చేశారు. కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ వెస్ట్ ‌లు సైజును బట్టి 1.5, 1.79, 1.85 కిలోల బరువుతో ఉంటాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.