
417views
బూస్టర్ డోస్ పంపిణీపై తుది నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం పడుతుందని ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. డోసుకు సంబంధించి మరిన్ని శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు టీకా డోసుల షెడ్యూలుపైనా చర్చలు జరుపుతున్నామని, టీకా వేసుకుంటే శరీరంలో ఏర్పడే రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదని కేంద్రం వెల్లడించింది.





