
608views
డమాస్కస్: సిరియాలోని లటాకియా నౌకాశ్రయంపై ఇజ్రాయెల్ క్షిపణులు దాడి చేసినట్టు సిరియా తెలిపింది. అయితే, ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్పష్టం చేసింది. పోర్ట్‌లోని కంటైనర్ ప్రాంతంలో అనేక క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించిందని సిరియాకు చెందిన ఓ మిలిటరీ అధికారి.. స్థానిక మీడియాకు వివరించారు. గతకొన్నేళ్లుగా సిరియా, ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి.
ఇప్పటికే వందలసార్లు ఇజ్రాయెల్ క్షిపణులు.. సిరియాపై దాడులు చేశాయి. సిరియా రాజధాని డమాస్కస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగానూ గతంలో దాడులు జరిగాయి. అయితే, సిరియాలో ఉన్న ఇరాన్ ఫైటర్స్పైనే తాము దాడులు జరిపామని ఇజ్రాయెల్ వెల్లడిస్తోంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





