News

అందుకే ప్ర‌యోగం ఆల‌స్య‌మ‌వుతోంది: ఇస్రో చైర్మ‌న్ శివ‌న్‌

736views

చంద్రుడిపై పరిశోధనల నిమిత్తం చేపట్టనున్న చంద్రయాన్-2 ప్రయోగాన్ని ముందుగా ప్రకటించినట్టుగా ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 16 మధ్య నిర్వహించడం లేదని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. బెంగళూరులో నిన్న మీడియాతో మాట్లాడుతూ, ఇంకా, పలు పరీక్షలు పూర్తి చేయాల్సి ఉన్నందున దీని ప్రయోగం ఆలస్యమవుతుందని వెల్లడించారు. ఏప్రిల్ రెండో వారంలో చంద్రయాన్-2 ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, ఈ ప్రయోగానికి మొత్తం రూ. 800 కోట్ల వ్యయం కానుందని అన్నారు. పదేళ్ల క్రితం నిర్వహించిన చంద్రయాన్-1 కంటే అత్యుత్తమ ప్రమాణాలతో చంద్రయాన్-2ను ప్రయోగిస్తామని పేర్కొన్నారు. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు భారత్ సొంతంగా చేపట్టనున్న గగన్ యాన్ ప్రాజెక్టులో మహిళా వ్యోమగాములకు కూడా భాగస్వామ్యం కల్పించనున్నట్టు శివన్ తెలిపారు.

 

Source : Bharath Today.

https://www.bhaarattoday.com/news/national/chandrayaan-2-launch-delayed-to-april-end-says-isro-chief/30185.html