
634views
-
ప్రదానం చేసిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ రోజు వీరచక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. బాలాకోట్ వైమానిక దాడి జరిగిన ఒక రోజు తర్వాత పాకిస్తాన్ వైమానిక దళం ఎల్‌ఓసీలో చొరబాటుకు యత్నించింది. దీనిని వీరోచితంగా అడ్డుకున్న వింగ్ కమాండర్(అప్పటి) అభినందన్ వర్ధమాన్ ఈ నెలలో పదోన్నతి పొందారు. అభినందన్‌కు వీరచక్ర ప్రదానం చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటన వెలువడింది. పాకిస్తానీ వాయు చొరబాట్లను నిరోధించినందుకు అతనికి గతంలో శౌర్య చక్ర అవార్డు లభించింది. ఇంకా, సప్పర్ ప్రకాష్ జాదవ్‌కు మరణానంతరం కీర్తి చక్ర లభించింది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల నిర్మూలనకు చేపట్టిన ఆపరేషన్‌లోని ఆయన పాత్రకు ఈ అవార్డు లభించింది.
Source: Tv9