News

హరిద్వార్‌లో ఘనంగా దేవతల దీపావళి

604views
  • ఉత్తరాదిలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

హ‌రిద్వార్‌: కార్తీక‌ పౌర్ణమి సందర్భంగా దేవ్​ దీపావళి వేడుకలు పలు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్​ హరిద్వార్‌లోని హ‌ర్ కీ పౌడీ ఘాట్​కు భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం రాత్రి 11 వేల దీపాలు వెలిగించి.. ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. వేలాది దీపాలు ఒకేచోట వెలుగుతుండటం అద్భుతమని అఖాడా పరిషత్​ అధ్యక్షుడు రవీంద్ర పురీ అన్నారు.

హర్​ కీ పౌడీలో జరుపుకొన్నట్టే వేడుకలను అన్ని దేవాలయాల్లో నిర్వహించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది అన్ని పుణ్యక్షేత్రాల్లో అత్యద్భుతంగా వేడుకలు ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. ఈ రోజున దేవతలు దీపావళి జరుపుకొంటారని ఉత్తరాది ప్రజలు నమ్ముతారు. స్వర్గం నుంచి భూమికి చేరుకొని దీపం వెలిగిస్తారని విశ్వసిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి