News

అత్యంత కాలుష్య నగరం పాకిస్తాన్‌లోని లాహోర్‌!

443views

న్యూఢిల్లీ: భారతదేశంలోని ఢిల్లీ ఎక్కువ కాలుష్య నగరమని, అక్కడ గాలి పీల్చుకుంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చాలా భయపడుతుంటారు. కానీ, ఢిల్లీ కంటే, అసలు ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరం ఒకటి ఉంది. అదే పాకిస్తాన్‌లోని లాహోర్‌!

గాలి నాణ్యతను పర్యవేక్షించే స్విట్జర్లాండ్‌ సంస్థ ఐక్యూఎయిర్‌ బుధవారం ఇందుకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. లాహోర్‌లో వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని, ఐక్యూ 300 కంటే ఎక్కువగా ఉందని తెలిపింది. కాలుష్యంతో భారీగా పొగమంచు కమ్ముకుంటుంది. పొగమంచు కారణంగా అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఐక్యూఎయిర్‌ పేర్కొంది. కాలుష్య తీవ్రతను లెక్కించి 348వ ర్యాంకును ఇచ్చింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి