News

అసభ్య ప్రవర్తనను అడ్డుకున్నందుకు కేరళలో చర్చిపై దాడికి పాల్పడ్డ CPI[M] గూండాలు.

606views

క్రిస్మస్ సందర్భంగా కేరళ కొట్టాయం జిల్లాలోని పతముట్టాత్ చర్చిలో జరిగిన వేడుకల సందర్భంగా కొందరు CPI[M] కార్యకర్తల అసభ్య ప్రవర్తనను, నృత్యాలను అడ్డుకున్న సదరు చర్చి వర్గాలపై ఆగ్రహంతో సదరు CPI[M] గూండాలు తాగి వచ్చి ఆ చర్చిపై ద్డది చేసి చర్చిలోని వస్తువులను ధ్వంసం చేసి, మహిళలు, పిల్లలని కూడా చూడకుండా చర్చిలోని వారిపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. అనంతరం చర్చిలోని వారు తమ ఇళ్ళకు బయలుదేరితే దారిలో మరళా దాడి జరుగుతున్దేమోననే భయంతో ఇళ్ళకు  వెళ్ళడానికి కూడా భయపడి చర్చిలోనే తలదాచుకున్నారు. చర్చిలోని వారికి రక్షణ కల్పిస్తున్న పోలీసు బృందం కూడా వారికి విడివిడిగా రక్షణ కల్పించడం తమకు సాధ్య పడదని చెప్పడం గమనార్హం.

తమను తాము మైనారిటీ ప్రజల రక్షకులుగా అభివర్ణించుకునే CPI[M] నాయకులు తమ కార్యకర్తలను సరయిన దారిలో పీతుకోలేక పోతుండడంపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. జనవరి 1న ” కేరళ సమాజం యొక్క విలువల పునరుజ్జీవనం” పేరుతో CPI[M] పెద్ద ఎత్తున చేయ తలపెట్టిన మానవహారం కూడా ఈ సందర్భంగా హాస్యాస్పదమవుతోంది. తమ కార్యకర్తలను నియంత్రించలేని వారు సమాజంలో విలువలను ఏ విధంగా పునరుజ్జీవింపజేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనాన్ని, యంత్రాంగాన్ని వినియోగిస్తూండడంపై  కూడా కేరళలోని వివిధ వర్గాల ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Source: VSK, Delhi.