
485views
ముంబై: ఉత్తరాది సహా మహారాష్ట్రలో ఛఠ్ పూజలు ఘనంగా జరిగాయి. వేడుకలు కుంభమేళాను తలపించాయి. దీపావళి పండుగ ఆరురోజుల తర్వాత ఛఠ్‌పూజ వేడుకలు జరుపుకోవటం సంప్రదాయంగా వస్తోంది. నాలుగు రోజులపాటు ఈ వేడుకల్లో భాగంగా పుణ్య స్నానాలు చేయటంతోపాటు మహిళలు ఉపవాస దీక్షలు చేస్తారు. నీళ్లల్లో నిలబడి సూర్య నారాయణస్వామికి ప్రసాదం నివేదిస్తారు.
ఆ తర్వాత జలం, క్షీరముతో అర్ఘ్యం సమర్పిస్తారు. ఛఠ్‌పూజ చివరిరోజు కావటంతో.. దిల్లీలోని నదీతీర ప్రాంతాలు కిటకిటలాడాయి. మహిళలు తమ కుటుంబ సభ్యులతోసహా పెద్దసంఖ్యలో ప్రత్యేక ఘాట్లకు చేరుకొని దీపారాధన చేశారు. అనంతరం ఆదిత్యున్ని ప్రార్థిస్తూ జలం, క్షీరంతో అర్ఘ్య ప్రదానం చేశారు. వివిధరకాల పండ్లు నైవేద్యంగా సమర్పించారు. నొయిడా, గోరక్‌పూర్‌లోనూ ఛఠ్‌పూజ వేడుకలు జరిగాయి.





