
656views
400 ఏళ్లనాటి పురాతన వినాయక విగ్రహాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో పట్టుకున్నట్లు చెన్నై విమానాశ్రయం అధికారులు తెలిపారు.
విదేశాల్లో విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న ‘నృత్య గణపతి’ విగ్రహం కాంచీపురంలోని ఓ ఇంట్లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ వినాయక విగ్రహం 130 కిలోల బరువు, 5.25 అడుగుల ఎత్తు ఉన్నట్లు చెప్పారు. ఇత్తడితో చేసినట్లు తెలిపారు. విగ్రహాల స్మగ్లింగ్ కు సంబంధం ఉన్నవారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. చెన్నై కస్టమ్స్ విభాగం సీజ్ చేసిన విగ్రహాల్లో ఇదే అతి పెద్దదని చెప్పారు.





