News

మోడీ సభలో వరుస బాంబుదాడుల కేసులో నేరస్థులకు ఉరిశిక్ష

495views

న్యూఢిల్లీ: 2013 పట్నా గాంధీ మైదాన్​లో వరుస బాంబు పేలుళ్ల కేసులో ఎన్​ఐఏ ప్రత్యేక కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది. మొత్తం 9 మంది దోషుల్లో నలుగురికి మరణశిక్ష విధించింది. ఇద్దరికి జీవితఖైదు, మరో ఇద్దరికి 10 ఏళ్లు, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష వేసింది. 2013 అక్టోబర్​ 27న.. నాటి భాజపా ప్రధాని అభ్యర్థి మోదీతో పాటు అనేక మంది కమలదళ నేతలు బిహార్​లో ర్యాలీలు నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో వరుస పేలుళ్లు రాష్ట్రాన్ని కుదిపేశాయి. మోదీ ర్యాలీ నిర్వహించాల్సిన హుంకర్​లోని గాంధీ మైదాన్​ లక్ష్యంగా ఈ పేలుళ్లు జరిగాయి. అనంతరం పట్నా రైల్వే స్టేషన్​లోనూ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 84 మంది గాయపడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి