
761views
సేవగఢ్ నుండి తిరుమల హతిరామ్ గఢ్ వరకు సాగుతున్న బంజారాల ఆరాధ్యదైవం, అవధూత సేవాలాల్ జ్యోతి రథ యాత్ర సేవగఢ్ నుండి అనంతపురం జిల్లాలోని తండాల్లో యాత్ర పూర్తిచేసుకొని, కర్నూల్ జిల్లాలోని తాండలలో యాత్ర కొనసాగుతూ ఉన్నది.
ఈ రోజు బండి ఆత్మకూర్ మండలం పెద్ద దేవలపురం ఏక శిలా ఆంజనేయ స్వామి దేవస్థానంలో జ్యోతి దర్శనం చేసుకొని, నంద్యాల మండలం అబాండం తండా, నంద్యాల టౌన్ వెంకటాచలం కాలనీ సీతారామ దేవస్థానంలో జ్యోతి దర్శనం జరిగినది.



ఈ రోజు యాత్రలో బంజారా ప్రముఖులు బంజారా ధర్మగురు శ్రీ శ్రీ శ్రీ భగత్ గణపతి స్వామి , శ్రీ నేనవత్ హాథిరామ్ నాయక్, శ్రీ నారాయణ నాయక్, శ్రీ రాజు,శ్రీ రవి,శ్రీ బాల, శ్రీ నాగేష్ నాయక్, కర్నూలు విభాగ్ ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.





