
ముంబై: షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు నుంచి బెయిల్ పై విడుదల అయ్యాడు. గురువారం నాడు ఆర్యన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదే రోజు బెయిల్ ఆర్డర్‌ను విడుదల చేయలేదు. బెయిల్ వచ్చినప్పటికీ రెండు రాత్రులు ఆర్యన్ జైల్లోనే గడిపాడు. నిన్న సాయంత్రం 5.30 గంటల్లోగా బెయిల్ పేపర్లను సమర్పించడంలో ఆర్యన్ లీగల్ టీమ్ విఫలమయింది. శుక్రవారం రాత్రి కూడా ఆర్యన్ జైల్లోనే గడిపాడు. ఈ రోజు ఉదయం ఆర్యన్ బయటకు వచ్చాడు.
ట్విట్టర్‌లో ట్రెండింగ్
ఆర్యన్ ఖాన్ విడుదలపై ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తున్నారు. #WelcomeHomeNashedi అంటూ ఆర్యన్ ఖాన్ విడుదలపై పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఆర్యన్‌తోపాటు మరో ఇద్దరు నిందితులు ఆర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచాలకు కూడా బెయిల్ లభించింది. కోర్టు నుంచి ఆర్డర్స్ అందగానే సంబంధిత ప్రొసీజర్‌ను పూర్తిచేసి ఇవాళ ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచాలను జైలు నుంచి విడుదల చేశారు. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ఈ నెల రెండోతేదీన ఎన్సీబీ అధికారులకు దొరికిపోయాడు. ఆర్యన్ ఖాన్‌తోపాటు మరికొంత మందిని కూడా అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్సీబీ అధికారులు విచారణ అనంతరం ఈ నెల ఎనిమిదోతేదీన ఆర్యన్ జైలుకు వెళ్లాడు.
రామ్ గోపాల్ వర్మ సెటైర్
ఆర్యన్ విడుదలపై రామ్ గోపాల్ వర్మ పలు వ్యాఖ్యలు చేశారు. ‘సాధారణంగా ప్రతి దీపావళికి ఖాన్ల విడుదల(ఖాన్ హీరోల సినిమాల విడుదల) ఉంటుంది. ఈ దీపావళికి కూడా ఖాన్ విడుదలయ్యాడు’ అని ఆయన సెటైర్ వేశారు.
Source: NationalistHub





