SSF అధ్యక్షులు శ్రీ MGK మూర్తి ఆకస్మిక మరణం: అణగారిన వర్గాల అభ్యున్నతికి అవిశ్రాంత పోరాటం చేసిన యోధుడు, కుటుంబ పెద్దను కోల్పోయామంటూ కార్యకర్తల ఆవేదన.

శ్రీ MGK మూర్తి IAS (Rtd)గారు (SSF అధ్యక్షులు) 21/12/2018 శుక్రవారం రాత్రి 8.30 నిమిషాలకు తీవ్ర గుండె పోటు కారణంగా విజయవాడలో వారి ఇంట్లో స్వర్గస్తులయ్యారు. వీరు కేరళ IAS కేడర్.కేరళ లో సుమారుగా 37సంవత్సరాలు IAS ఆఫీసర్ గా,జిల్లా కలెక్టర్ గా,రెవిన్యూ సెక్రటరీ గా వివిధ హోదాల్లో పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానములో ధార్మిక కౌన్సిల్ సభ్యులు గా పనిచేశారు. SC, STలు, అణగారిన వర్గాల వారు అర్చకులు గా శిక్షణ పొందాలని ,ఆ శిక్షణ కూడా TTD ఇవ్వాలని పట్టు పట్టి ఆంధ్ర,తెలంగాణ ప్రాంతాల్లో సుమారుగ 5 వేలమంది కి తిరుపతిలో TTD చే శిక్షణ ఇప్పించారు. సామాజిక సమరసత వేదిక ప్రాంత అధ్యక్షులు గా పనిచేస్తూ, అందరిలో సమత్వ భావన తీసుకురావడానికి, మతమార్పిడి ఆపడానికి ఆవిర్భవించిన సమరసతా సేవా ఫౌండేషన్ కు కూడా రాష్ట్ర అధ్యక్షుడు గా నిరంతరం పర్యటన చేశారు. SC, ST, మత్యకార ప్రాంతాల్లో TTD ద్వారా 500 నూతన దేవాలయాల నిర్మాణం లో వారి కృషి సాటి లేనిది. తిరుమల లో జరిగిన ధార్మిక సదస్సులో నిమ్న వర్గాల వారు దేవాలయం ప్రవేశం కోసం, ధర్మం కోసం వారు పడుతున్న తాపత్రయం గూర్చి వారు ఆవేదన గా చెబుతూంటే ధర్మాచార్యులందరిని కదిలించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫౌండేషన్ పని మారుమూల పల్లెల వరకు వెళ్లాలని వారు తాపత్రయం చెందుతూ, ప్రతి సమావేశంలో సమాజంలో వస్తున్న మార్పులు గూర్చి అడుగుతూ , అంత వయస్సు లో కూడా అన్ని జిల్లాలకు పర్యటన చేశారు.
అట్టి ఒక మహనీయుని నిర్గమనం, నిష్క్రమణంతో తాము కుటుంబ పెద్దను కోల్పోయిన వ్యక్తులగా మనం మిగిలామని SSF శ్రేణులు ఆవేదన చెందుతున్నాయి.





