News

దాదాపు 33 వస్తువులపై గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్‌ను త‌గ్గించడం విశేషం. ఈరోజు జీఎస్టీపై జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

434views

దాదాపు 33 వస్తువులపై గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్‌ను త‌గ్గించడం విశేషం. ఈరోజు జీఎస్టీపై జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలో జీఎస్టీ మండలి 33 వస్తువులపై పన్ను తగ్గించాలని నిర్ణయించింది. 7 వస్తువులపై పన్నులను 28 నుంచి 18శాతానికి తగ్గించాలని నిర్ణయించిన జీఎస్టీ మండలి మరో 26 వస్తువులపై 18నుంచి 12 శాతం, 5శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఫిట్‌మెంట్‌ కమిటీ భేటీ అయి మిగిలిన వస్తువులపై పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకోనుంది. ప‌న్ను సంస్క‌ర‌ణ‌లో భాగంగా జీఎస్టీ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. దీంతో అనేక‌ వ‌స్తువుల‌ను 28 నుంచి 5 శాతం ప‌న్ను ప‌రిధిలోకి తీసుకొచ్చారు.

పన్ను రేటు తగ్గిన వస్తువుల్లో 32 ఇంచుల ఎల్‌ఈడీ టీవి, వీడియో గేమ్స్, లిథియం పవర్ బ్యాంక్స్, చిన్న తరహా క్రీడా వస్తువులు, ఉన్నాయి. ఆధ్యాత్మిక యాత్రలకు ఎకానమీ క్లాస్‌ విమాన టికెట్‌పై పన్ను రేటును 5శాతం శ్లాబులోకి, బిజినెస్ క్లాస్ టికెట్‌పై పన్ను రేటును 12శాతం శ్లాబులోకి చేర్చారు. 13రకాల ఆటోమొబైల్స్, సిమెంట్ రంగానికి చెందిన 8 వస్తువులు 28 శాతం శ్లాబులో చేర్చారు. 6 వస్తువులను 28 శాతం శ్లాబు నుంచి కింది శ్లాబుల్లోకి మార్చారు. 28 శాతం నుంచి 5 శాతం శ్లాబుకు తగ్గించిన వస్తువుల్లో వీల్‌చైర్స్ ఉన్నాయి. ఇక ఇన్సూరెన్స్‌ను 12శాతం పన్ను శ్లాబులో చేర్చారు.

SOURCE: Bharath Today.