News

బంగ్లాదేశ్‌లో గొంతెత్తిన‌ హిందువు!

712views

ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువుల‌పై అక్క‌డి ముస్లింలు మ‌త వివ‌క్ష చూపుతూ కొన్నేళ్ళుగా మార‌ణ‌కాండకు పాల్ప‌డుతుండ‌డం తెలిసిందే. తాజాగా ద‌స‌రా మ‌హోత్స‌వాల్లో గుళ్ళు, గోపురాల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. అక్క‌డి పాల‌కులు ఈ దేశం మ‌త ప్రాతిప‌దిక‌న ఏర్ప‌డ‌లేదు… 1972 రాజ్యాంగం ప్రకారం బంగ్లాదేశ్ ఒక లౌకిక దేశం అని, తమ దేశం ఇస్లాం దేశం కాదని.. ఒక సెక్కులర్ దేశమని ఘోషిస్తున్నా అక్క‌డి దుండ‌గులు త‌మ దాడుల‌కు ముగింపు ప‌ల‌క‌డం లేదు. దీంతో హిందువులు రోడ్ల‌పై నిర‌స‌న ర్యాలీలు జ‌రిపారు. బంగ్లాదేశ్‌లో నిత్యం హిందువుల‌పై చోటుచేసుకుంటున్న దారుణాల‌పై నిన‌దించారు. దాడులు ఆపాల‌ని, నిందితుల‌ను శిక్షించాల‌ని గ‌ట్టిగా నినాదాలు చేశారు.

Source: Ratan Sharda Tweet

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి