
500views
పెంటగాన్: అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో మరో భారతీయ అమెరికన్కు చోటు దక్కింది. అగ్రరాజ్య రక్షణ శాఖ విభాగం పెంటగాన్‌లో కీలక పదవికి భారతీయ అమెరికన్ మేనేజ్మెంట్ సలహాదారు ఆశిష్ వజిరాణిని నామినేట్ చేయనున్నట్టు బైడెన్ ప్రకటించారు. రక్షణ మంత్రి ఆధ్వర్యంలోని సిబ్బంది, యుద్ధ సన్నద్ధత విభాగం డిప్యూటీగా వజిరాణి నామినేట్ అయినట్టు పెంటగాన్ తెలిపింది. మరోవైపు.. పెంటగాన్‌లో కీలక పదవితో పాటు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇంజినీరింగ్, మెడిసన్స్ కమిటీల్లో సభ్యులుగా వజిరాణి ఎంపికయినట్టు శ్వేతసౌధం తెలిపింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





