News

పుతిన్ గెలుపు!

405views
  • ఎన్నికల్లో యునైటెడ్‌ రష్యా ఘన విజయం

మాస్కో: రష్యాపై తనకున్న గట్టి పట్టును ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి నిరూపించుకున్నారు. పార్లమెంటు దిగువ సభ ‘డ్యూమా’కు తాజాగా జరిగిన ఎన్నికల్లో అధికార ‘యునైటెడ్‌ రష్యా పార్టీ ఘన విజయం సాధించింది! దాదాపు 98% పోలింగ్‌ కేంద్రాల నుంచి ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. డ్యూమాలో మొత్తం 450 సీట్లు ఉంటాయి. వాటిలో సగం సీట్లను(225) దామాషా ప్రాతినిధ్య పద్ధతిలో భర్తీ చేస్తారు.

మిగిలిన సగం సీట్లకు అభ్యర్థులను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ప్రస్తుతం రెండు విధానాల్లోనూ అధికార పార్టీ దూసుకెళ్తోంది. పోలైనవాటిలో 49.8% ఓట్లు దక్కించుకోవడం ద్వారా యునైటెడ్‌ రష్యా పార్టీ తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. 19% ఓట్లతో రష్యా కమ్యూనిస్టు పార్టీ రెండో స్థానంలో ఉంది. మరోవైపు- అభ్యర్థుల పరంగా చూసినా.. యునైటెడ్‌ రష్యా పార్టీ తరపున పోటీ చేసిన వారు 198 స్థానాల్లో (225‌కుగాను) ఆధిక్యంలో కొనసాగుతున్నారని కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి