News

సిగ్గుమాలిన పాకిస్తాన్‌!

527views
  • మంచినీరు పట్టుకున్నారని హిందువులను కొట్టిన ముస్లింలు

లాహోర్‌: తన ప్రవర్తన వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎందరు చీత్కరించుకున్నా పాకిస్తాన్‌కు మాత్రం సిగ్గుమాలిన తనంగా లేదు. తన వైఖరి తనదే… బుద్ది తెచ్చుకోదు. పంజాబ్‌లోని మసీదు నుండి ఓ హిందూ వ్యవసాయం కుటుంబం తాగడానికి నీళ్ళు తెచ్చుకుంది. దీంతో రహీమ్‌ యార్‌ ఖాన్‌ బస్తీ కహూర్‌ ఖాన్‌ ప్రాంతానికి చెందిన కొందరు స్థానికులు మతపరమైన స్థలాన్ని అపవిత్రం చేశారని వారిని బంధించారు.

అక్కడి పత్రిక డాన్‌ కథనం ప్రకారం… కొన్ని రోజుల క్రితం ఆలం రామ్‌ భీల్‌ తన భార్యతో సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పొలంలో ముడి పత్తిని తీస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. మంచినీటిని తాగడానికి కుటుంబం సమీపంలోని మసీదుకు వెళ్లినప్పుడు, కొంతమంది స్థానికులు వారిని కొట్టారు. గ్రామస్థులు వారిని అవుట్‌ హౌస్‌ వద్ద బందీలుగా ఉంచి, కుటుంబం ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు మళ్లీ హింసించారు. దాడి చేసినవారు స్థానిక పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ పార్లమెంటేరియన్‌కి సంబంధించినవారు కావడంతో ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేయలేదని భీల్‌ తెలిపారు.

పాకిస్తాన్‌లో రోజు రోజుకూ మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయి. రహీమ్‌ యార్‌ ఖాన్‌లోని భోంగ్‌ పట్టణంలో ఇటీవల ఆలయాన్ని ధ్వంసం చేశారు. దాడి, విధ్వంసానికి సంబంధించిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీంతో తన మైనారిటీల ప్రయోజనాలను కాపాడనందుకు అంతర్జాతీయ సమాజం పదేపదే ఆ దేశాన్ని చీవాట్లు పెట్టింది. అయినా… మారలేదు!

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి