
-
భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీసులు
ఢిల్లీ: దేశంలో బాంబు పేలుళ్ళకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారు. అయితే, దీనిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు భగ్నం చేయడంతో భారీ ముప్పు తప్పింది. అయోధ్యతో పాటు నవరాత్రి వేడుకల్లో పేలుళ్లకు ఈ ముఠా కుట్ర చేసినట్టు గుర్తించారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఢిల్లీ పోలీసులు అనుమానితులను అరెస్ట్ చేశారు.
జీషన్ కమార్, మహ్మద్ అబూబకార్, మహ్మద్ అలీ షేక్, మూల్‌చంద్, ఉసైద్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ అమీర్ జావేద్ అనే ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల సాయంతో ముగ్గురు ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో ఈ ఉగ్రవాదులు పేలుళ్లకు కుట్ర చేశారు. అరెస్టయిన ఉగ్రవాదుల దగ్గరి నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆయా రాష్ట్రాల నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ముఠాను అరెస్ట్ చేశారు. వీటి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రితో పాటు విలువైన సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Source: Tv9





