News

బ్రేకింగ్‌ న్యూస్‌… వినాయక చవితి ఉత్సవాలకు హైకోర్టు అనుమతి

997views

అమరావతి: ఏపీలోని ప్రైవేట్‌ స్థలాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను బుధవారం హైకోర్టు విచారించింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని స్పష్టం చేసింది.

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని కోర్టు సూచించింది. అలాగే బహిరంగ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించకూడదని తెలిపింది. అయితే, ప్రైవేటు స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

 

Source : Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి