స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉగ్రదాడి యత్నాన్ని భగ్నం చేసిన పంజాబ్ పోలీసులు , యుకెలోని ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు

699views
పంజాబ్ పోలీసులు స్వాతంత్ర్య దినోత్సవం నాడు అమృత్ సర్ లో UK కి చెందిన తీవ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా ఒక పెద్ద ఉగ్రదాడిని నివారించారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
“మొత్తం రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు పిస్టల్స్ (9 మిమీ), నాలుగు మ్యాగజైన్‌లు, 20 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆయుధాల చట్టం 1959 సెక్షన్ 25/27 మరియు పేలుడు పదార్థాల (సవరణ) చట్టం సెక్షన్లు 3,4,5 కింద అమృత్‌సర్‌లోని ఘరిందా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది ” అని పోలీసులు చెప్పారు.
స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఐఎస్ఐ, ఉగ్రవాద దాడులకు పన్నాగం పన్నుతున్నట్లుగా ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది. ఆ మేరకే పోలీసులు గట్టి నిఘా ఉంచి దుండగులను చాకచక్యంగా పట్టుకోగలిగారు.
Source : Organiser





