News

భారత్ ఆర్థికాభివృద్ధి స్థిరంగా ఉంది – అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ వెల్లడి

730views

భారత్ కు ‘బీబీబీ’ రేటింగ్‌ను యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్ అండ్ పీ పేర్కొంది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినా.. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి ఆర్థిక వ్యవస్థ వృద్ధి పుంజుకోవచ్చనే అంచనాతో భవిష్యత్‌ అంచనాను ‘స్థిరత్వం’గా ఉంచుతున్నట్లు వెల్లడించింది.

భారత్‌కు వరుసగా 14వ సంవత్సరమూ తక్కువ పెట్టుబడుల గ్రేడ్‌ను అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ కొనసాగించింది. ప్రస్తుతం నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం చాలా ముఖ్యమని తెలిపింది. పెట్టుబడులను పెంచేందుకు, ఉద్యోగాల సృష్టికి అదనపు ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.