
821views
పాక్ సరిహద్దుల్లో పాకిస్థాన్‌కు చెందిన బాంబులు నిర్వీర్యం చేస్తున్న క్రమంలో ఉమామహేశ్వరరావు అనే జవాన్ గతేడాది వీరమరణం పొందారు. ఆర్మీలో బాంబ్ స్క్వాడ్ విభాగంలో ఆయన విధులు నిర్వహించేవారు. దేశ రక్షణకై విధులు నిర్వర్తిస్తూ అమరుడైన వీర జవాన్‌కు నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏ ఒక్కరూ రాలేదని అప్పట్లో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్..జవాను కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన అమర జవాను కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.





