News

నమామి గంగే కార్యక్రమం క్రింద అయోధ్యలో ఐదు రామాయణ కాలం నాటి నీటి కుండాలను పునరుద్ధరించనున్న అధికారులు

1.2kviews

మామి గంగే (పవిత్ర గంగానది ప్రక్షాళన) కార్యక్రమంలో భాగంగా అయోధ్యలో ఐదు రామాయణ కాలం నాటి నీటి కుండాలను పునరుద్ధరించాలని అధికారులు గుర్తించారు.

ఆ మేరకు బ్రహ్మ కుండ్, ఫతేగంగ్, శ్రీ సీతా రామ్ మందిర్ కుండ్, లాల్ దిగ్ఘి మరియు స్వామి రామ్ జీ దాస్ ఆశ్రమం తలాబ్ లను రామాయణ కాలం నాటి నీటి కుండాలుగా అధికారులు గుర్తించారు. నమామి గంగే కార్యక్రమంలో భాగంగా ఆ నీటి కుండాలను పునరుద్దరించనున్నారు.

నమామి గంగే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జల శక్తి మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి 18 నెలల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రజల దైనందిన జీవితంలో కళను కూడా ఏకీకృతం చేసే ప్రయత్నం చేయాలని కూడా నిర్ణయించారు. అయోధ్యను అంతర్జాతీయ మత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులలో ఒక మైలురాయిగా నిలిచేలా 2019 లో అయోధ్యలో గొప్ప శ్రీ రామ ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ చారిత్రాత్మక తీరును వెలువరించిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఆగస్టు 5 న ఆలయ భూమి పూజలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.