
586views
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో పోలీసులు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జైంతియా జిల్లాలోని కాంగోంగ్ చెక్‌పోస్టు వద్ద నిర్వహించిన సోదాల్లో 250 కిలోల పేలుడు పదార్థాలు (2000 జిలెటిన్ స్టిక్స్), 1000 లైవ్ డిటోనేటర్లను కారులో తరలిస్తూ ఇద్దరు నిందితులు చిక్కారు.
నిందితుల సమాచారంతో క్లేరియట్ అనే ప్రాంతంలో సోదాలు నిర్వహించిన పోలీసులు భారీగా పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో 1,275 కిలోల పేలుడు పదార్థాలు సహా మరో 5000 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్ జనరల్ జీకే లాంగ్రాయ్ వెల్లడించారు. మరో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.





