News

కరోనా వ్యాక్సిన్ పరీక్షలకు సమ్మతి తెలిపిన ఆరెస్సెస్ స్వయంసేవక్

2.5kviews

సిఎంఆర్ మరియు భారత్ బయోటెక్ సంయుక్తంగా కరోనా ఔషధాలను తయారు చేస్తున్నాయి. మరియు ఆగస్టు 15 న ఔషధ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

కరోనా వ్యాక్సిన్ ను మానవులపై పరీక్షించే ప్రక్రియ భారతదేశంలో ప్రారంభం కానుంది. ఇందుకోసం పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడు మరియు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయం సేవక్  అయిన చిరంజిత్ ధీవార్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సంస్థ ఆహ్వానించింది.

పరీక్షలు ఏ తేదీ నుండి ప్రారంభమవుతాయో వారికి ఇంకా చెప్పలేదు, కానీ చిరంజీత్ దీనికి సిద్ధంగా ఉండాలని ఐసీఎంఆర్ ఆయనను కోరింది. భువనేశ్వర్ లేదా పాట్నాలలోని ఐసిఎంఆర్ లో ఈ టీకా పరీక్షించబడుతుందని తెలిస్తోంది.

కరోనా ఔషధం యొక్క మానవ ప్రయోగాల కోసం చిరంజీత్ తనను తాను సమర్పించుకున్నాడు, అందుకు అతను ఎంపికయ్యాడు కూడా. కరోనా సోకిన వ్యక్తులపై ఐసిఎంఆర్ ఔషధ పరీక్ష నిర్వహిస్తుంది. టీకా పరీక్షను మానవ శరీరంపై జూలై 07 (మంగళవారం) నుంచి ప్రారంభించారు. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 7 లక్షల 18 వేల 872 కు పెరిగింది. చిరంజీత్‌కు ఆదివారం ఐసిఎంఆర్ పాట్నా సెంటర్ నుంచి కాల్ వచ్చిందని, త్వరలో పరీక్షకు సిద్దంగా ఉండమని చెప్పారని తెలిపారు. చిరంజిత్ ఏప్రిల్‌లో ఐసిఎంఆర్‌కు ఒక అభ్యర్థన పంపారు. దీనిలో తను క్లినికల్ ట్రయల్  కోసం టీకా తీసుకోవడానికి  తన సంసిద్ధతను తెలియ జేశారు.

కరోనా మందు పని తీరును తెలుసుకోవాలంటే మానవులపై పరీక్ష చేయాల్సి ఉందని చిరంజీత్ అన్నారు. “అందు కోసం ఎవరైనా ముందుకు వచ్చి రిస్క్ తీసుకోవాలి. అది నేనెందుకు కాకూడదు? కాబట్టి ఇది మానవజాతి మరియు దేశానికి సేవ చేసే ప్రయత్నం.  దీనికి నేను మానసికంగా సిద్ధంగా ఉన్నాను. నేను ఒత్తిడికి గురికావడం లేదు. సంఘ ప్రేరణ పొందిన కారణంగా మానవ సేవ కోసం తాను ముందుకు వచ్చానని ఆయన చెప్పారు.

మానవాళికి కరోనా వ్యాక్సిన్ లభిస్తుందని నేను నమ్ముతున్నాను. నా కొడుకు చేస్తున్న పనికి అందరూ ఆయనను ప్రశంసిస్తారు” అని చిరంజీత్ తండ్రి తపన్ ధీవార్ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.