ArticlesNews

ప్రపంచమంతా భారత్ బాటలోకి…….

803views

శ్రీ పి వీ ఆర్ నరసింహా రావు గారు 2019లో ఇంగ్లీష్ లో వ్రాసిన భవిష్యవాణి..మిత్రులు తెలుగులోకి అనువదించారు..ఇప్పుడు VSK పాఠకుల కోసం..

శ్రీ పి వీ ఆర్ నరసింహా రావు గారు మన AP కి చెందిన వారు. IIT మద్రాసులో చదివి,  అమెరికాలో Boston లో Software Engineer గ పని చేస్తూ, జ్యోతిష్య శాస్త్రంలో పరిశోధనలు చేస్తూ గొప్ప predictor గా పేరు తెచ్చుకున్న P V R నరసింహారావు గారు మార్చి2019 లో చేసిన predictions ప్రకారం….

 

  • మోడీ రెండవ సారి గెలుస్తారు. మొదటి సారి కంటే రెండవ సారి ఎక్కువ ప్రతిభ కనబరుస్తారు.

ప్రపంచం Un-stable గా వుండబోయే 2020-23 మధ్య కాలంలో ఆయన భారత్ ను stable గా ఉంచగలుగుతారు.

మోడీ మూడవసారి కూడా గెలుస్తారు కానీ మూడవ టర్మ్ మధ్యలో ఆయన మరొకరిని ప్రదానిగా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటారు.

AP లో జగన్ గెలుస్తారు. కానీ ఆయన ప్రజలు అనుకుంటున్నంత గొప్ప నాయకుడుగా పేరు తెచ్చుకోలేరు.

 

  • USA లో 2020 లో Trump ఓడిపోతారు. ఆయన భవిష్యత్ నిరాశ నిసృహలతో కూడి వుంటుంది.

ప్రెసిడెంట్ నిక్సన్ కాలంలో మొదలయిన అమెరికా – చైనా మంచి సంబంధాల వలన చైనా ఎంత బాగా ఎదిగిందో, ట్రంప్ కాలంలో చెడిపోయే అమెరికా – చైనా సంబంధాల కారణంగా చైనా అంతగా దిగజారి దెబ్బతింటుంది.

US ఎకానమీ బాగా కుదేలవుతుంది. ట్రంప్ మళ్లీ గెలవడానికి తగిన వాతావరణాన్ని కల్పించుకోవడానికి తమ శతృ దేశాలతో దూకుడుగా వ్యవహరిస్తాడు. ఫలితంగా ఇరాన్ కేంద్రంగా చిన్న పాటి యుద్దమే జరగవచ్చు లేక  Far east లో కూడా టెన్షన్ లు రావచ్చు [అనగా జపాన్, కొరియా, తైవాన్, చైనా లు కలిసే south china sea area లో].

 

  • చైనా ఆధిపత్యం మరికొంత కాలం కొనసాగుతుంది. దానికున్న ఆర్థిక, వస్తు సప్లయింగ్ పవర్ తో అది USA ను చికాకు పెడుతుంది.

US – China సంబంధాలు మరింత క్షీణిస్తాయి. US –  China మధ్య Cold war మొదలవుతుంది.

రాబోయే సంవత్సరాలలో చైనా పలు అంతర్గత మరియు బహిర్గత సమస్యలను ఎదుర్కొంటుంది. శత్రువులు పెరిగిపోయి, ఆర్థిక మందగమనం ఏర్పడి, ప్రజల నుంచి తిరుగుబాట్లు మొదలయి 1990 వ దశకంలో రష్యా కుప్పకూలినట్లు రాబోయే 10, 15 స్ంవత్సరాలలో చైనా నాలుగైదు దేశాలుగా విడిపోతుంది. అందులో టిబెట్ ఒకటిగా వుండవచ్చు.

యుద్దాలు జరిగినా అణుబాంబులు వేసుకునేంత పెద్ద యుద్దాలు జరగవు.

 

  • ప్రపంచంలో దేశాల ప్రాదాన్యతల మార్పు (New World Order) – చైనా ముక్కలవుతుంది.

అమెరికా (ఒకనాటి బ్రిటిష్ సామ్రాజ్యం తన ప్రాభవాన్ని క్రమంగా కోల్పోయినట్లుగా) ప్రపంచంపై తనకున్న పట్టును కోల్పోతుంది.

అమెరికా బలంగానే వుంటుంది కానీ ప్రపంచంపై పెత్తనం చేసే తన వైఖరిని విడనాడుతుంది.

అమెరికా – యిండియా సంబంధాలు మెరుగ్గా, బలంగా ఉంటాయి.

కేపిటలిజం, కమ్యూనిజం పోయి వాటి స్థానంలో భారత్ పాటించే ధార్మిక ఎకానమీ (విలువలు, బాధ్యత, మానవత్వంతో కూడిన పెట్టుబడి దారీ వ్యవస్థ) ప్రపంచంలో పాటింప బడుతుంది.

రాబోయే కాలంలో భారత దేశ ప్రాముఖ్యత, గౌరవం, సాఫ్ట్ పవర్ పెరుగుతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారమే కాకుండా ప్రపంచ గతిని గమనిస్తున్న వివిద రంగాల నిపుణుల అంచనా ప్రకారం కూడా చైనా కంటే భారత్ సురక్షితంగా వుంటుంది.

చైనా – భారత్ మద్య యుద్దం జరిగే అవకాశాలు చాలా తక్కువ.

భారత్ కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. (ట్రంప్ ఓడినా అమెరికా – చైనా సంబంధాలు మెరుగు పడటం కష్టం) రష్యా న్యూట్రల్ గా వుండిపోతుంది. చైనా వ్యవహారశైలి వలన గతంలో రష్యా అనేక యిబ్బందులు పడింది. అందువలన అది చైనాకు మద్దతుగా రాదు. Western powers ను కంట్రోల్ చేయడానికి మాత్రమే రష్యా చైనాకు మద్దతిస్తుంది తప్ప భారతదేశం విషయంలో రష్యా చైనాకు మద్దతు యివ్వదు. 1962 లో కూడా చైనా రష్యా సపోర్టుతో కాదు అమెరికా సపోర్టుతో ఇండియాపై యుద్దానికి దిగింది. టిబెట్ పై చైనా వైఖరి మొదటి నుండి రష్యాకు నచ్చదు.

చైనా భారత్ తో యుద్దం చేయాలంటే అది కొన్ని వేల కిలోమీటర్ల దూరం తన యుద్ద వనరులను తూర్పు నుండి పడమరకు తేవాలి. అలా తెస్తే దాని తూర్పు ప్రాంతం బలహీనం అవుతుంది అపుడు తూర్పున అమెరికా గాని, జపాన్ కాని, తైవాన్ గాని, ద.కొరియా కాని, వియత్నాం గాని దాడి చేస్తే అది తట్టుకోలేదు.

హిమాలయాల పర్వతాలను దాటి చైనా ముందుకు రాలేదు. ఒకవేళ కొంత మేర వచ్చినా అది దాని పట్టును ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేదు.

అది మనతో యుద్దం చేస్తే సాదించేది తక్కువ, నష్ట పోయేది ఎక్కువ.

దాని వ్యాపార, సరుకు నౌకలు అన్నీ మన అండమాన్ పక్కన ఉన్న మలక్కా సందు గుండా వెళ్ళాలి, అక్కడ మనం దాని నౌకలను ఆపేస్తే దాని ఎకానమీ తట్టుకోలేదు.

మనం చైనా నౌకలను అక్కడ అడ్డుకుంటామనే భయంతోనే అది 1971 లో బంగ్లా దేశ్ యుద్దంలో జోక్యం చేసుకోలేదు.

ప్రస్తుతం చైనా  ఆర్థిక ఒత్తిడిలో వుంది. అది హాంకాంగ్ నుంచీ చాలా అప్పులు, పెట్టుబడులు పొందింది. హాంకాంగ్ కు ప్రపంచ దేశాలతో మంచి ఆర్థిక సంబందాలు వున్నాయి. ఇప్పుడు హాంకాంగ్ చైనా కంట్రోల్లోకి వెళ్లడంతో హాంకాంగ్ దెబ్బ తింటుంది, దానితో బాటు చైనా ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి. హాంకాంగ్ బంగారు బాతు కానీ చైనా దానిని చంపి తినాలనుకుంటున్నది.

చైనా కమ్యూనిస్టు పార్టీకి పార్టీలోనూ అసమ్మతి పెరుగుతున్నది. దేశ ప్రజలలోనూ అసమ్మతి పెరుగుతున్నది.

ఆ దేశ సైన్యాన్ని ఆ పార్టీ నాయకత్వమే నడిపిస్తుంది (ప్రొఫెషనల్ నాయకత్వం లేదు) అందువలన అక్కడి సైన్యంలో అవినీతి ఎక్కువ.

చైనాకు యుద్ద పరికరాలు ఎక్కువ వుండవచ్చు కానీ యుద్దం చేయడానికి సంసిద్దత గల సైన్యం, ఆ సైన్యానికి తగిన అనుభవం, వ్యాహాలు లేవు. వారికిచుట్టూ శత్రువులు వున్నారు. ద, కొరియా, జపాన్, పిలిప్పీన్స్, తైవాన్, వియత్నాం, ఆస్ట్రేలియా …. యివన్నీ చైనా పతనాన్ని కోరుకుంటున్నాయి. చైనా ఆధిపత్యాన్ని కోరుకునే దేశం పాకిస్తాన్ ఒక్కటే. కానీ అది చైనాకు ఎలాంటి సాయమూ చేయలేదు, అదే అడుక్కు తింటున్నది.

ముక్తాయింపు ఏమిటంటే భారత దేశం యుద్దం చేయకుండానే చైనాను ఓడిస్తుంది. ఆ యుద్ధంలో మనమూ చైనా వస్తువులను బహిష్కరించడం ద్వారా పాల్గొనాలి. 2035  లోపలే చైనా అయిదు ముక్కలవుతుంది. ఆ శుభ  దినాలు చూడాలని నా ఆశ…

– PVR నరసింహరావు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.