News

2550మంది తబ్లిగీలపై నిషేదం

1.1kviews

దేశంలో కరోనా వైరస్‌పై పోరాడుతున్న సమయంలో దిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్‌ కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. విదేశాల నుంచి భారత్‌ వచ్చిన తబ్లిగీ కార్యకర్తలు ఇక్కడ వీసా నిబంధనలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలింది. ఇలా వచ్చిన దాదాపు 2550మంది విదేశీయులను భారత ప్రభుత్వం ఇప్పటికే నిషేధిత జాబితాలో చేర్చింది. తాజాగా వీరందరిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన 2550మంది తబ్లిగీలను 10ఏళ్ల పాటు భారత్‌లోకి రాకుండా నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చిన తబ్లిగీలు దిల్లీ నిజాముద్దీన్‌లో మతపరమైన సమావేశంలో పాల్గొన్నారని దిల్లీ పోలీసుల విచారణలో తేలింది. ఇదే విషయాన్ని దిల్లీ హైకోర్టుకు కూడా పోలీసులు తెలియజేశారు. అయితే, దిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌ కార్యక్రమం అనంతరం తబ్లిగీలు దేశంలోని పలు రాష్ట్రాలకు వెళ్లిపోయారు. దీంతో కరోనా వైరస్‌ అన్ని రాష్ట్రాలకు విస్తృత వేగంతో వ్యాపించినట్లు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలుసార్లు స్పష్టం చేశాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.