NewsSeva

స్వయంసేవకులు : ఆపత్కాలంలో అండగా నిలచే ఆత్మీయులు

315views

ఎల్ జి పాలీమర్స్ నుండి రసాయన విష వాయువు వెలువడి అనేక మంది అస్వస్థతకు గురై 20 గంటలు పూర్తి కాకుండానే…. పట్టణంలో రేగిన పుకార్లు ప్రజలను భయభ్రాంతులను చేశాయి.

రెండవసారి విషవాయువు లీకవుతోందని, కొంత సేపట్లో కర్మాగారం పేలిపోయే అవకాశం ఉందని…. ఇలా రకరకాల పుకార్లు షికారు చేశాయి.

7వ తేది గురువారం పుకార్ల కారణంగా భయభ్రాంతులకు గురైన లక్షలాది మంది ప్రజలు కకావికలై ప్రాణాలను అరచేత పట్టుకొని రాత్రి 11.30- 12 గం మధ్య ఇళ్ళను వదిలి  పరుగులు తీశారు. ఆ సమయంలో సంఘ కార్యకర్తలు పరిస్థితిని అర్ధం చేసుకొని కొంతమందికి విశాలాక్షి నగర్ పాఠశాలలో వసతి ఇవ్వాలని భారతీయ విద్యా కేంద్ర (BVK) వారికి సూచించగా, BVK వారు వెంటనే స్పదించి 500 మంది  నిరాశ్రితులకు వసతి కల్పించారు. BVK ఆధ్వర్యంలో, సేవాభారతి సహకారంతో పాఠశాలలోనూ మరియు చెట్ల క్రింద తలదాచుకొన్నవారికి ఆహార పొట్లాలు అందించారు.

సేవా భారతి ఆధ్వర్యంలో బాధిత 8 గ్రామలలోని 32 వేల మందికి ఆహారం అందించారు. ఇవికాక మంచినీరు, మజ్జిగ, గ్లూకోజ్ నీరు, పండ్లు అందించారు. KGH వద్ద 500 మందికి ఆహారం అందించారు.

ఒక్క ఫోన్ కాల్ (పిలుపు) కు స్పందించి అతికొద్ది సమయంలో సుమారు 200 మంది స్వయంసేవకులు సిద్ధమై వెంటనే సర్వే తదితర కార్యక్రమాలలో నిమగ్నమైనారు. నలుగురు కార్యకర్తలు 38 గం పనిచేశారు.  స్వయంసేవకులు చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి బాధితులు చలించిపోయారు. “ఆపత్కాలంలో ఆత్మీయులలా, అన్నదమ్ముల్లా ఆదుకున్నారు నాయనా…” అంటూ ప్రేమగా ఆశీర్వదించారు. స్వయంసేవకుల సేవలను పోలీసు అధికారులు కూడా ప్రశంసించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.