News

విశాఖ బాధితులకు ABVP బాసట

922views

విశాఖలోని RR వెంకటాపురం, సింహాచలం, పెందుర్తి,కృష్ణరాయపురం,గ్రామాలలో LG-గ్యాస్ లీకేజీ వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్న విషయం పాఠకులకు తెలిసిందే.

గ్యాస్ లీకేజీ వార్త తెలిసిన వెంటనే ABVP విద్యార్థులు బాధితులకు తమ వంతు సాయం అందించడానికి ముందుకు ఉరికారు. అందుబాటులో వున్న వాహనాలలో కొందరు బాధితులను హాస్పిటళ్ళకు తరలించారు. భోజన మరియు మజ్జిగ పొట్లాలు సిద్ధం చేసి బాధితులకు అందించారు.

అలాగే రెండవ రోజు కూడా 300 మందికి భోజన ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేసి అందజేశారు. తీవ్రమైన దుఃఖంతో బాధపడుతున్న స్థానికులకు మేమున్నాం అంటూ ధైర్యం చెప్పారు. వయసులో చిన్నవారైనా పెద్ద మనసుతో తోడు నిలిచారని స్థానికులు విద్యార్థులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ABVP విభాగ్ కన్వీనర్ శ్రీ భానుమూర్తి, ఆంధ్ర, తెలంగాణ వనవాసి విద్యార్థుల ప్రముఖ్ శ్రీ కృష్ణ, ABVP జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ జగదీష్, విభాగ్ మహిళా కన్వీనర్ అనూష, జిల్లా కో కన్వీనర్ హరి ప్రసాద్, సిటీ సెక్రటరీ రాజయ్య, గుప్తా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.