
18views
నాగపూర్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజయ దశమి ఉత్సవం నాగపూర్ లోని రేషంబాగ్ లో ప్రారంభమైంది. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా దైనిక్ జాగరణ్ పత్రిక చీఫ్ ఎడిటర్ సంజయ్ గుప్తా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సంజయ్ గుప్తా, ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ రావ్ భాగవత్ రేషంబాగ్ లోని డాక్టర్జీ, గురూజీ స్మృతి మందిరాల దగ్గర పుష్పార్చన చేశారు. తర్వాత విజయ దశమి ఉత్సవం జరిగే వేదిక వద్దకు చేరుకొని, ఇరువురు కూడా ఆయుధ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వయంసేవకులు చేసిన శారీరిక్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.




