News

కృష్ణ జింకను అక్రమంగా వేటాడిన ఆరుగురి ముస్లింల అరెస్ట్.. కేసులు నమోదు

2views

బీదర్ లోని హోన్నికేరి రిజర్వ్డ్ ఫారెస్ట్ సమీపంలో చోండి మామదాపూర్ దగ్గర కృష్ణ జింకను అక్రమంగా వేటాడినందుకు అటవీ శాఖ ఆరుగురు ముస్లింలను అరెస్ట్ చేసింది.కలబురిగి జిల్లాలోని చించోలి, ఖాజీ గల్లీకి చెందిన మస్తాన్ అలీ కుమారుడు షోయబ్ మాలిక్; హైదరాబాద్‌లోని చార్మినార్-ఫలక్‌నుమా ప్రాంతం, నవాబ్ సాహబ్ కుంటలోని సలేహీన్ కాలనీకి చెందిన అబ్దుల్ జమీల్ కుమారుడు అబ్దుల్ సయీద్; హైదరాబాద్‌లోని మలక్‌పేట, అక్బర్ బాగ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ హమీద్ ఉజ్జమాన్ కుమారుడు మహమ్మద్ హమీద్ ఉజ్జమాన్ అరెస్టైన వారిలో వున్నారు. వీరిపై వన్యప్రాణి చట్ట ఉల్లంఘన కేసు కింద కేసు నమోదైంది. వీరందర్నీ కోర్టులో హాజరు పరిచారు.

ఈ ఘటన ఈ నెల 17 న జరిగింది. అటవీ ప్రాంతంలోకి నూతన వ్యక్తులు ప్రవేశించి, కృష్ణ జింకను వేటాడినట్లు, వారి కదలికలను స్థానికులు గమనించారు. దీంతో వెంటనే వారిని అడ్డుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు.
స్థానికులు నిందితులలో ముగ్గురిని వెంబడించి పట్టుకుని, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. మిగిలిన ముగ్గురు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన తర్వాత, పరారీలో ఉన్న అనుమానితుల కోసం అటవీ శాఖ ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టింది.

రాత్రంతా కొనసాగిన ఈ గాలింపు చర్యల ఫలితంగా, పరారైన ఆ ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.అంతేకాకుండా వేట కోసం ఉపయోగించిన వాహనాలను, రైఫిల్ ను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసలు నిందితులు అటవీ ప్రాంతంలోకి ఎలా ప్రవేశించారు? ఇవన్నీ ఎలా సంపాదించారు? అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

నిందితులలో ముగ్గురు పొరుగున ఉన్న కలబురిగి జిల్లాలోని చించోలి తాలూకాకు చెందినవారని, మిగిలిన ముగ్గురు తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందినవారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ బృందం ఎలా ఏకమై చొండి-మామదాపూర్ గడ్డి మైదానానికి చేరుకుందనే దానిపై అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.ఘటనలో తెలంగాణకు చెందిన వ్యక్తులు అత్యాధునిక, సుదూర లక్ష్యాలను ఛేదించగల రైఫిల్స్‌తో పాల్గొన్నారని అధికారులు తెలిపారు.